కాల్ సెంటర్ స్కామ్

కాల్ సెంటర్ స్కామ్

నోయిడా కాల్ సెంటర్ లో పనిచేస్తున్న 84 మంది అమెరికా జనాలకు టోపీ పెట్టారు. వాళ్ళ డేటాను డార్క్ వెబ్ లో లీక్ చేశారు.

నోయిడా కాల్ సెంటర్ స్కామ్

నోయిడా సెక్టార్ 6 లో హర్షిత్ కుమార్, యోగేష్ పండిత్ అనే ఇద్దరు 4 నెలల క్రితం కాల్ సెంటర్ ప్రారంభించారు. 84 మందిని నియమించుకున్నారు, వాళ్ళకి అక్కడ scam జరుగుతోందని తెలుసు.  ఎక్కువ ప్రోత్సాహకాలు ఇవ్వడంతో వాళ్ళు పోలీసులకు తెలియజేయలేదు, ఉద్యోగం మానేయలేదు.  వీరిలో 38 మంది మహిళలు ఉన్నారు.

పోలీసుల సమాచారం ప్రకారం వీళ్ళు 4 లక్షల మంది యూఎస్ సిటిజెన్స్ కి కాల్ చేశారు, 600 వందల కంటే ఎక్కువ మందికి టోపీ పెట్టారు. వీళ్ళు రోజుకి 40 లక్షల రూపాయలు సంపాదించారు. 

ఉద్యోగులకు అమెరికన్ యాసలో మాట్లాడే విధంగా ట్రైనింగ్ ఇచ్చారు.  ముఖ్యంగా అమెరికా సోషల్ సెక్యూరిటి అడ్మినిస్ట్రేషన్ అధికారులు మాట్లాడే విధంగా ఏలా మాట్లాడాలో ట్రైనింగ్ ఇచ్చారు.

నోయిడా కాల్ సెంటర్ స్కామ్ ఏలా చేశారో తెలుసుకుందాం ?

అమెరికా సిటిజెన్స్ కి Social security number (SSN) ఉంటుంది.  – ఇది 9 అంకెల యూనిక్ నెంబర్.   దీనితో వారి ఆదాయాన్ని ట్రాక్ చేయవచ్చు మరియు ఇతర సమాచారాన్ని సేకరించవచ్చు.

Vici dial, eye beam సాఫ్ట్ వేర్స్ ఉపయోగించి వాయిస్ మెసేజ్ లు పంపించేవారు.  SSN కార్డ్ సస్పెన్షన్ అవుతోందని కాల్ చేయమని నెంబర్ ఇచ్చేవారు. ఎవరైనా కాల్ చేస్తే వాళ్ళ డీటైల్స్ కలెక్ట్ చేసేవారు.

SSN చివరి నాలుగు నెంబర్స్ తీసుకొని వారి పేరు మీద ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు ఉన్నాయా అని చెక్ చేసేవారు.  మోసగాళ్ళు కాల్ ను యూస్ మార్షల్ సర్విస్ కు ట్రాన్స్ ఫర్ చేస్తున్నాము అనే చెప్పేవారు. ఆ కాల్ ను వాళ్ళ టీమ్ లోని వేరే వ్యక్తి కి ట్రాన్సఫర్ చేసేవారు అతను యూస్ మార్షల్ కింద మాట్లాడే వాడు.

బ్యాంక్ లో డబ్బులు సీజ్ అవుతాయని వాటిని  crypto లేదా gift కార్డ్ క్రింద మార్చుకోమని భాదితులకు చెప్పేవాడు. ఎక్కువ మంది అమౌంట్ ను crypto గా మార్చుకొని కోడ్ షేర్ చేసేవారు మోసగాళ్ళతో, మరి కొంతమంది గిఫ్ట్ కార్డ్ కొని సీక్రెట్ నెంబర్ షేర్ చేసేవారు వాటి ద్వారా మోసగాళ్ళు ఆ మనీని వారి అక్కౌంట్ లోకి తరిలించుకునేవారు.

ఈ స్కామ్ కాల్ సెంటర్ ను ncr పోలీసులు కనిపెట్టారు.  ఉద్యోగులు అందరు దొరికారు ఈ కంపెనీ ప్రారంభించిన ఇద్దరు పరారీలో ఉన్నారు. కాల్ సెంటర్ సిబ్బందిపై ఐపిసి సెక్షన్లు 420 , 120బి మరియు ఐటి చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

150 కంప్యూటర్లు, రూ.20 లక్షల నగదు, కొన్ని డాక్యుమెంట్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్, సైబర్ నిపుణులు కంప్యూటర్లను నుండి డేటా సేకరిస్తున్నారు.

Nagasurya